

మాజీ ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు ఏపీపీఎస్సీ వ్యవహారంపై ఏపీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి పలు ప్రశ్నలు సంధించారు. ఎక్స్‌లో చేసిన పోస్టులో. ఏడాది కాలంగా చైర్మన్‌ను ఎందుకు నియమించలేకపోయారని ప్రశ్నించారు. అక్రమాలు జరిగాయని చెబుతున్న సమయంలోనే ఆర్‌డీవోలు, ఎస్‌డీపీవోలుగా ఫోకల్ పోస్టింగులు ఎందుకు ఇచ్చారని, ప్రొబేషన్ డిక్లేర్ కాకముందే ఇలాంటి పోస్టింగులు ఎలా ఇస్తారని నిలదీశారు. హైకోర్టు ఆదేశాల తర్వాత కూడా పోస్టింగులను మార్చలేదని, కంటెంప్ట్ చర్యల హెచ్చరిక రావడంతోనే మార్పులు చేశారని ఆరోపించారు.
గతంలో గౌతమ్ సవాంగ్ దాఖలు చేసిన అఫిడవిట్లను ప్రభుత్వం తరఫు ఏజీ సమర్థిస్తూ వాదించారని రావు పేర్కొన్నారు. గత నియామకాల విషయంలో ప్రభుత్వం రాజీకి వచ్చిందని ఆరోపించిన ఆయన. కోర్టు జోక్యంతోనే దర్యాప్తు ముందుకు సాగిందని అన్నారు. ఇప్పుడు వ్యవహారం బయటపడిన తర్వాత ప్రభుత్వం ఏమీ తెలియనట్లుగా మాట్లాడుతోందని విమర్శించారు. గౌతమ్ సవాంగ్‌ను గతంలో ఒక కేసు నుంచి బయటపడేసింది ప్రభుత్వమేనని, ఇప్పుడు ఏపీపీఎస్సీ వ్యవహారంలోనూ ఆయన్ను కాపాడుతున్నారని ఆరోపిస్తూ. అసలు ఏం డీల్ కుదుర్చుకున్నారో చెప్పాలని సీఎంను ప్రశ్నించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!