
సినిమాలు

ఉక్రెయిన్లో కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించాలనే లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యా పై మరింత ఒత్తిడి పెంచే ఉద్దేశంతో ద్వైపాక్షిక ఆంక్షలకు సంబంధించిన ఒక కీలక బిల్లుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ఈ బిల్లులో భాగంగా, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాల పై కఠిన చర్యలు తీసుకునే ప్రతిపాదన ఉంది. ముఖ్యంగా భారత్, చైనా వంటి దేశాల పై 500 శాతం వరకు సుంకాలు విధించే అంశానికి ట్రంప్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
ఈ విషయాన్ని రిపబ్లికన్ సెనెటర్ లిండ్సే గ్రాహం సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో వెల్లడించడంతో అంతర్జాతీయ స్థాయిలో చర్చ మొదలైంది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే ప్రపంచ వాణిజ్యం, ఇంధన మార్కెట్ల పై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!