

నటి వరలక్ష్మి శరత్ కుమార్ తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత, ఎస్. సరస్వతి సినిమాతో దర్శకురాలిగా మారింది. ఈ సినిమాలో ఆమె ప్రధాన పాత్రలో కూడా నటించింది. భారీ అంచనాలతో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని సాధించలేదు. విడుదలైన నెలలోపే ఈ సినిమా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చి, ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ నెల 6 న విడుదలైన ఈ సైకాలజికల్ థ్రిల్లర్‌లో రాధిక శరత్ కుమార్, ప్రియమణి, ప్రకాశ్ రాజ్, రావు రమేష్, మురళి శర్మ వంటి ప్రముఖులు నటించారు. థియేటర్లలో ఫ్లాప్ అయినప్పటికీ, సినిమాలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఉత్కంఠభరిత సన్నివేశాలు ఓటీటీ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయని మేకర్స్ భావిస్తున్నారు. రిలీజ్ సమయంలో టైటిల్ వివాదం, రచయిత సాయి మాధవ్ బుర్రా చేసిన ఆరోపణలు కూడా చర్చనీయాంశమయ్యాయి. ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమా ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!