
బిజినెస్

తిమ్మరాజుపల్లి టీవీ సినిమా రేపు నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ కిరణ్ అబ్బవరం తన కెఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. థియేటర్స్‌లో మంచి విజయాన్ని సాధించిన ఈ గ్రామీణ నేపథ్య పీరియాడిక్ డ్రామా ఇప్పుడు డిజిటల్ రిలీజ్‌కు సిద్ధమైంది.
హైదరాబాద్‌లో నిర్వహించిన ఈవెంట్‌లో చిత్రబృందం పాల్గొని తమ అనుభవాలను పంచుకుంది. సినిమా థియేటర్స్‌లో మంచి స్పందన వచ్చిందని, ఇప్పుడు ఆహా ద్వారా మరింత పెద్ద ప్రేక్షక వర్గానికి చేరుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. కిరణ్ అబ్బవరం ఈ చిత్రం నిర్మాతగా తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!