

టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థగా గుర్తింపు పొందిన మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పటివరకు పలు బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించి, అగ్ర హీరోలతో సినిమాలు చేసింది. అయితే, తొలిసారిగా హారర్ జానర్‌లోకి అడుగుపెడుతూ ‘418’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. చైత్ర జె. ఆచార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు కీర్తన్ నాగగౌడ దర్శకత్వం వహించారు. సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ వద్ద పనిచేసిన ఆయన ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, ప్రశాంత్ నీల్ సమర్పకుడిగా వ్యవహరించారు. థియేటర్లలో నాలుగు వారాల ప్రదర్శన పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి థియేటర్లలో విడుదలైన ఈ హారర్ థ్రిల్లర్ ఓటీటీలో ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
‘ఏ’ సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రంలో సూర్య రాజ్ వీరభద్రిణి, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల, రమేష్ ఇందిర, శశాంక్ పాటిల్, శ్రీ వైష్ణవ్, కోట జయరాం, గోపరాజు విజయ్, శ్రీకాంత్ గణేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించగా, అనిల్ యెర్నేని సహ నిర్మాతగా వ్యవహరించారు. వెన్నీ జీజీ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఐదు భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రావడంతో ఈ హారర్ థ్రిల్లర్‌కు దేశవ్యాప్తంగా మరింత మంది ప్రేక్షకులను చేరుకునే అవకాశం లభించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!