
సినిమాలు

తాజాగా థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ‘పాపం ప్రతాప్’ చిత్రం ఇప్పుడు ఓటీటీకి రాబోతోంది. తిరువీర్, పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఎస్పీ దుర్గా నరేశ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా రేపటి నుంచి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
కథ విషయానికి వస్తే, ప్రతాప్ తన చిన్ననాటి ప్రేమ బుజ్జమ్మను పెళ్లి చేసుకుంటాడు. అయితే పెళ్లి తర్వాత వారి జీవితంలో అనుకోని సమస్యలు ఎదురవుతాయి. ప్రతాప్ తనలో ఉన్న సమస్యను గుర్తించి సరిచేసుకుంటేనే తిరిగి కాపురానికి వస్తానని బుజ్జమ్మ చెబుతుంది. ఆ సమస్య ఏమిటి, ప్రతాప్ దాన్ని ఎలా పరిష్కరించాడు అనేదే కథ ప్రధానాంశం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!