

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పాన్-ఇండియా చిత్రం ‘రాకా’పై ఇప్పటికే అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ‘పుష్ప 2’తో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన అల్లు అర్జున్, ఇప్పుడు ‘రాకా’తో మరో సంచలనానికి సిద్ధమవుతున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దాదాపు రూ.800 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో అల్లు అర్జున్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారనే వార్తలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.
ఇక ‘రాకా’ డిజిటల్ హక్కులపై కూడా భారీ చర్చ జరుగుతోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా ఓటీటీ హక్కుల కోసం నిర్మాతలు రూ.300 కోట్లకు పైగా ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ డీల్ కుదిరితే భారతీయ సినీ చరిత్రలోనే అతిపెద్ద ఓటీటీ ఒప్పందాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. ‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం కావడం, అట్లీ దర్శకత్వం వహించడం, అలాగే పాన్-వరల్డ్ మార్కెటింగ్ వ్యూహాలతో తెరకెక్కుతుండటంతో ‘రాకా’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!