
రివ్యూలు

తన నిర్మాణ సంస్థ రూపొందించిన తాజా చిత్రానికి తొలి రోజే లభించిన అద్భుత స్పందనపై నటి సమంత రూత్ ప్రభు భావోద్వేగంగా స్పందించారు. సినిమా విజయానికి ప్రేక్షకులు చూపిన ప్రేమ ఎంతో వినమ్రతను కలిగించిందని ఆమె పేర్కొన్నారు. కథ బలంగా ఉంటే అది హీరో ఆధారిత చిత్రమా, హీరోయిన్ ఆధారిత చిత్రమా అన్న తేడా లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.
ప్రత్యేకంగా మహిళా ప్రేక్షకుల మద్దతు తనను ఎంతో సంతోషపరిచిందని సమంత తెలిపారు. ఇంతకాలం థియేటర్లలో ఓపెనింగ్స్‌కు పురుష ప్రేక్షకులే ప్రధాన కారణమని భావించేవారని, కానీ ఇప్పుడు మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరగడం సినీ రంగంలో సానుకూల మార్పుకు సంకేతమని అన్నారు. తమ నిర్మాణ సంస్థ ట్రాలాలా పిక్చర్స్ ఈ విజయంతో మరో మైలురాయిని అందుకుందని సమంత పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!