
జనరల్

రాయదుర్గం భూముల వ్యవహారంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పాత్రపై తెలంగాణ ప్రభుత్వం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించినట్లు సమాచారం. ఈ అంశంలో రాజకీయ కోణం ఉండొచ్చనే అనుమానాన్ని ప్రభుత్వ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. భూముల వ్యవహారానికి సంబంధించిన పరిణామాలను అధికారులు సమగ్రంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందిన ఎస్బీఐ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ చల్లా శ్రీనివాసులు శెట్టిపై రాజకీయ ప్రత్యర్థుల ప్రభావం ఉండొచ్చని ప్రభుత్వ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఎస్బీఐ వ్యవహారంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), కేంద్ర ఆర్థిక శాఖ, అలాగే ప్రధాన మంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేయాలని తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ అంశంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!