
రాజకీయాలు

బాలీవుడ్ సీనియర్ నటి కరిష్మా కపూర్ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘బ్రౌన్’ జూన్ 5 నుంచి ZEE5లో స్ట్రీమింగ్ కానుంది. అభిక్ బారువా రచించిన City of Death నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్‌కు అభినయ్ డియో దర్శకత్వం వహించారు. కోల్‌కతా నగరాన్ని నేపథ్యంగా తీసుకుని రూపొందిన ఈ నియో-నోయిర్ థ్రిల్లర్‌లో కరిష్మా ‘రీటా బ్రౌన్’ అనే పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు.
ఈ సిరీస్‌లో హెలెన్, సోనీ రజ్దాన్, సూర్య శర్మ కీలక పాత్రలు పోషించారు. మానసిక ఒత్తిడితో పోరాడుతూనే ఓ హైప్రొఫైల్ హత్య కేసును ఛేదించే మహిళా అధికారి కథ చుట్టూ ఈ సిరీస్ సాగుతుంది. కన్నడ డబ్బింగ్, తెలుగు సబ్‌టైటిల్స్‌తో అందుబాటులోకి వస్తున్న ఈ వెబ్ సిరీస్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!