

యంగ్ హీరో ఆది సాయికుమార్ నటించిన సినిమా ‘శంబాల’ ఓటీటీలో సరికొత్త రికార్డు సృష్టించింది. థియేటర్లలో మంచి విజయం సాధించిన ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనూ భారీ ఆదరణ పొందుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా కేవలం 11 రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలు పూర్తి చేసి సంచలనం సృష్టించింది.
యుగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ‘శంబాల’ గతేడాది డిసెంబర్ 25 న థియేటర్లలో విడుదల అయింది. అక్కడ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిన తర్వాత, గత నెల 21 న ఆహా ఓటీటీలో విడుదల అయ్యింది. విడుదలైన మొదటి రోజునుంచే సినిమా విశేష ఆదరణ పొందుతూ ఈ కీలక మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా ఆహా సంస్థ తమ సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో ప్రత్యేక పోస్టర్ విడుదల చేసి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
ఈ విజయంతో ‘శంబాల’ థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో కూడా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా తెలుగులో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో హిందీ వెర్షన్ విడుదలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. హిందీ వెర్షన్ అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కావొచ్చని ప్రచారం సాగుతున్నప్పటికీ, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!