

తెలుగు ప్రేక్షకులను రెండు సీజన్లతో విశేషంగా ఆకట్టుకున్న వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’ ఇప్పుడు మూడో సీజన్‌తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. 2023లో విడుదలైన తొలి సీజన్ ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి మంచి స్పందన అందుకోగా, రెండో సీజన్ కూడా అదే స్థాయిలో విజయాన్ని సాధించింది. ఇప్పుడు జియో హాట్‌స్టార్ అధికారికంగా సీజన్-3ను ప్రకటించడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
మహి వి. రాఘవ్, ప్రదీప్ అద్వైతం షో రన్నర్స్‌గా వ్యవహరిస్తున్న ఈ కొత్త సీజన్లో మరిన్ని ట్విస్టులు, కొత్త పాత్రలు ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రియదర్శి, జోర్దార్ సుజాత, అభినవ్ గోమటం, దేవియాని శర్మ తదితరులు తమ పాత్రలతో మళ్లీ అలరించనున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్‌ను బట్టి ఈసారి కథలో కాస్మిక్ ట్విస్ట్ కూడా ఉండబోతున్నట్లు హింట్ ఇచ్చారు. వెన్నెల కిషోర్ ఎంట్రీ ఈ సీజన్‌కు మరింత వినోదాన్ని జోడించనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!