
జనరల్

సందీప్ రెడ్డి వంగా సమర్పణలో, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన రోమాంచకం సినిమా ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో పలు భాషల్లో అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో విడుదలైన తర్వాత ఓటీటీలోకి అడుగుపెట్టింది. సుమంత్ అశ్విన్, అనంతిక సనిల్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించగా, సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను విస్తృతంగా ప్రమోట్ చేశారు.
థియేటర్లలో ఈ చిత్రానికి యువ ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వేదికగా మరింత మంది ప్రేక్షకులను చేరుకునే అవకాశం లభించింది. నరేంద్ర రవి, వెంకటేశ్ కాకుమాను, మణి ఏగుర్ల, సాయి సోహన్, ఉపేంద్ర లిమయే కీలక పాత్రల్లో నటించారు. భద్రకాళి పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి వాసుకి వైభవ్ సంగీతం అందించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!