

ప్రైమ్ వీడియో తన కొత్త తెలుగు క్రైమ్ థ్రిల్లర్ “చీకటిలో” ట్రైలర్ను విడుదల చేసింది. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. సురేష్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి శరణ్ కొపిశెట్టి దర్శకత్వం వహించారు. హైదరాబాద్ నేపథ్యంలో సాగే ఈ కథలో శోభితా ధూళిపాళ ‘సంధ్య’ అనే క్రైమ్ పాడ్కాస్టర్ పాత్రలో కనిపిస్తారు. 20 ఏళ్ల క్రితం జరిగిన వరుస హత్యల వెనుక ఉన్న రహస్యాలను, ఒక సీరియల్ కిల్లర్ ఆచూకీని తన పాడ్కాస్ట్ ద్వారా బయటపెట్టేందుకు ఆమె చేసే ప్రయత్నమే కథాంశం.
విడుదలైన ట్రైలర్ ఉత్కంఠభరితంగా సాగుతూ, సంధ్య ఎదుర్కొనే ప్రమాదాలు మరియు సత్యం కోసం ఆమె చేసే పోరాటాన్ని ఆసక్తికరంగా చూపిస్తుంది. శోభితాతో పాటు విశ్వదేవ్ రాచకొండ, చైతన్య విశాలాక్షి, ఈషా చావ్లా, ఝాన్సీ, ఆమని, వడ్లమాని శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటించారు. నిజం గెలుస్తుందా? లేక సంధ్య కిల్లర్ బారిన పడుతుందా? అనే ప్రశ్నలతో ట్రైలర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా జనవరి 23న ప్రపంచవ్యాప్తంగా ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!