

థియేటర్లలో మంచి ఆదరణ పొందిన మలయాళ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ కాటాలన్ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఆంటోనీ వర్గీస్ పెపే ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో తెలుగు నటుడు సునీల్ కీలక పాత్ర పోషించగా, లోకేష్ కనగరాజ్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. దుషార విజయన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా ప్రధాన ఆకర్షణ నిజమైన ఏనుగుతో తెరకెక్కించిన యాక్షన్ సన్నివేశాలే. ఎలాంటి సీజీఐ లేదా వీఎఫ్ఎక్స్ ఉపయోగించకుండా చిత్రీకరించడం విశేషం.
పాల్ జార్జ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి బాహుబలి 2, జవాన్, పొన్నియిన్ సెల్వన్ వంటి చిత్రాలకు పనిచేసిన కెచ్చా ఖంపక్డీ స్టంట్స్ అందించారు. రవి బస్రూర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సమకూర్చగా, బి. అజనీష్ లోక్‌నాథ్ ప్రత్యేక గీతాన్ని స్వరపరిచారు. థియేటర్లలో ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం ఐఎమ్‌డీబీలో 8.2 రేటింగ్ సాధించింది. ఇప్పుడు ఆగస్టు 4 నుంచి మనోరమ మ్యాక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!