
క్రీడలు

మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ జంటగా నటించిన లెనిన్ థియేటర్లలో ఘన విజయాన్ని సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ₹100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి అఖిల్ కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. జీ5 వేదికగా ఆగస్టు 7 నుంచి సినిమా స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది.
మొదట ఈ చిత్రాన్ని కేవలం తెలుగు వెర్షన్‌లో మాత్రమే విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన జీ5, తాజాగా తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. దీంతో ఈ సినిమాకు దక్షిణాది ప్రేక్షకుల్లో మరింత ఆదరణ లభించే అవకాశం ఉంది. అయితే హిందీ వెర్షన్‌పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందించగా నాగార్జున అక్కినేని, నాగ వంశీ నిర్మించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!