
గాసిప్స్

జీ5 లో త్వరలో స్ట్రీమింగ్ కానున్న వెబ్ సిరీస్ ‘మేము కాప్‌లం’ తాజాగా విడుదలైన ట్రైలర్‌తో ఆసక్తిని పెంచుతోంది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్‌లో కామెడీ, సస్పెన్స్, మిస్టరీ అంశాలను వినోదాత్మకంగా చూపించారు. మహదేవపట్నం గ్రామానికి పెద్దగా నాగబాబు నటించగా, ఆయన ‘సలార్ రాజు’ అనే కోడిపుంజును తన వారసుడిలా చూసుకోవడం ట్రైలర్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అయితే ఆ కోడిపుంజు ఒక్కసారిగా కనిపించకుండా పోవడంతో కథ మలుపుతీసుకుంటుంది. దానిని వెతికే బాధ్యత తీసుకున్న పోలీసుల పాత్రల్లో గెటప్ శ్రీను, రవితేజ నన్నిమల కామెడీతో అలరిస్తున్నారు. కోడిపుంజు కోసం సాగిన విచారణలో ఊరిలో దాగి ఉన్న రహస్యాలు బయటపడటం కథపై మరింత ఉత్కంఠ పెంచుతోంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో మంచి స్పందన అందుకుంటోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!