

"ఏనుగు తొండం ఘటికాచలం” టీజర్ రవి బాబు కొత్త ఓటీటీ కామెడీ ఎంటర్టైనర్! రవి బాబు తెరకెక్కిస్తున్న తాజా ఓటీటీ సినిమా ‘ఏనుగు తొండం ఘటికాచలం’ నవంబర్ 13, 2025 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్ రిలీజ్‌ను దాటేసి, నేరుగా ఓటీటీలోకి వస్తోన్న ఈ సినిమా పక్కా కామెడీ ఎంటర్టైనర్గా కనిపిస్తోంది.
ఈరోజు రిలీజ్ చేసిన టీజర్ మొత్తం ఒక గూఫీ కామెడీ లా కనిపించింది. మొదట్లో సీనియర్ నటుడు నరేష్‌కి అందరూ “ఒక్కసారి చచ్చిపోరా, దేవుడి కోసం!” అని సీరియస్‌గా చెబుతుంటారు. కానీ అక్కడి నుంచి సడన్‌గా టీజర్ ఫన్ మోడ్‌కి మారి, ఒక చావు చుట్టూ జరిగే హాస్యభరితమైన గందరగోళాన్ని చూపిస్తుంది.
రవి బాబు సినిమాల్లో ఉండే క్రేజీ కామెడీకి అభిమానులు బాగా ఫ్యామిలియర్. ఈ సినిమా కూడా అదే లైన్లో ఉందని టీజర్ ద్వారా అర్థమవుతోంది. ఇందులో టీవీ స్టార్ వర్షిణి సౌందరరాజన్ కీలక పాత్రలో నటిస్తుండగా, రవి బాబు స్వయంగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. మొత్తానికి, “తొండం ఏనుగు ఘటికాచలం” టీజర్ చూస్తుంటే నవ్వులు పూయించే, పిచ్చి పిచ్చి సీన్లతో నిండిన కామెడీ రైడ్ అని చెప్పొచ్చు!



.avif&w=3840&q=75)






కామెంట్స్ (3)
ఆ సినిమా చాలా హాస్యభరితం
This looks hilarious! Can’t wait to watch it on OTT.
"ఒక్కసారి చచ్చిపోరా" dialogue already iconic 🤣🤣