

2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన హెచ్-1బీ వీసాలపై అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం కీలక ప్రకటన చేసింది. 85 వేల వీసా స్లాట్లకు సరిపడా సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని తెలిపింది. లాటరీలో ఎంపికైన అభ్యర్థుల పూర్తి స్థాయి దరఖాస్తులను సమర్పించేందుకు సంస్థలకు ఇచ్చిన గడువు 2026 జూన్ 30తో ముగిసిందని వెల్లడించింది. దీంతో ఈ ఏడాది రెండోసారి హెచ్-1బీ వీసా లాటరీ నిర్వహించే అవకాశం లేదని తెలుస్తోంది.
అమెరికా కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు ప్రతి ఏడాది 85 వేల హెచ్-1బీ వీసాలు జారీ చేస్తాయి. ఇందులో 65 వేల వీసాలు సాధారణ కేటగిరీ కింద, మరో 20 వేల వీసాలు మాస్టర్ డిగ్రీ కేటగిరీ కింద ఉంటాయి. 2026-27 సంవత్సరానికి 2.11 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య 38.5 శాతం తగ్గింది. కొత్త విధానంలో అధిక వేతనాలు, ఉన్నత నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులకు ఎక్కువ అవకాశాలు లభించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఎంపిక వివరాలను త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!