

భారత్‌లో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్) విధించే అంశంపై చర్చ జరుగుతోంది. యూపీఐ వినియోగించే వ్యాపారులపై ఎండీఆర్ ఛార్జీలు ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఛార్జీలు 0.5 శాతం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ నిర్ణయంపై పరిశ్రమ నిపుణులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
యూపీఐ లావాదేవీలపై అదనపు ఛార్జీలు విధిస్తే వ్యాపారులపై భారం పెరిగి, ఆ ప్రభావం వినియోగదారులపై పడే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న వ్యాపారులు, కిరాణా దుకాణాలు వంటి సంస్థలపై కూడా దీని ప్రభావం పడవచ్చని అభిప్రాయపడుతున్నారు. డిజిటల్ చెల్లింపుల వినియోగం తగ్గకుండా, పేమెంట్ వ్యవస్థలో పెట్టుబడులు కొనసాగించేలా సమతుల్య విధానం అవసరమని సూచిస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!