

అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై రూపొందిన చిత్రం ‘హే చికీతా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఎన్. అశోక్ ఆర్ఎన్ఎస్, గరుడవేగ అంజి నిర్మించిన ఈ చిత్రానికి ధన్ రాజ్ లెక్కల దర్శకత్వం వహించారు. అభినవ్ మణికంఠ, దివిజ ప్రభాకర్, తన్మయ్ ఖుషి, దేవి ప్రసాద్, ఈటీవీ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. జూలై 24న సినిమా విడుదల కానుండగా, ట్రైలర్‌ను ఈ వేడుకలో విడుదల చేశారు. ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ, చిన్న సినిమాలు విజయాలు సాధిస్తే వచ్చే సంతృప్తి ఎంతో గొప్పదని, ‘హే చికీతా’ చిత్రంతో చిత్రబృందానికి మంచి పేరు రావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన అలీ, వీఎన్ ఆదిత్య, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, రామ్ లక్ష్మణ్ మాస్టర్స్, ప్రసన్న కుమార్ తదితరులు చిత్ర విజయాన్ని కోరుకున్నారు. రైతులు, యువత అంశాలను ప్రస్తావిస్తూ రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రబృందం విశ్వాసం వ్యక్తం చేసింది. దర్శకుడు ధన్ రాజ్ లెక్కల తన తొలి చిత్రంగా ‘హే చికీతా’ను ఎంతో ప్రత్యేకంగా తెరకెక్కించామని, జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి అందరి మద్దతు కావాలని కోరారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!