
జనరల్

విక్రాంత్ మస్సే, వేదిక పింటో, మహిమా మక్వానా ప్రధాన పాత్రల్లో రూపొందిన రొమాంటిక్ డ్రామా సిరీస్ 'ముసాఫిర్ కేఫ్' ట్రైలర్‌ను నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది. దివ్య ప్రకాశ్ దూబే రాసిన ప్రముఖ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్ ప్రేమ, విరహం, మళ్లీ జీవితంలో ఎదురయ్యే అనుబంధాల చుట్టూ సాగుతుంది. భావోద్వేగభరితమైన కథనం, అందమైన విజువల్స్‌తో ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.
ట్రైలర్ ప్రకారం చందర్ అనే యువకుడు సుధను ప్రేమిస్తాడు. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా ఇద్దరూ విడిపోతారు. కొన్నేళ్ల తర్వాత చందర్ ప్రీతితో కొత్త జీవితాన్ని ప్రారంభించే ప్రయత్నం చేస్తాడు. గతం మళ్లీ అతని జీవితంలోకి రావడంతో కథ ఆసక్తికర మలుపులు తిరుగుతుంది. ఈ సిరీస్ జూలై 24 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుండగా, తెలుగులోనూ విడుదలయ్యే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!