
ఓటీటీ

బీఆర్ఎస్ యువసంగ్రామ సభలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ ఘాటుగా స్పందించింది. ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలకు స్పందించాల్సిన అవసరం ఉందా అంటూ ఎద్దేవా చేసిన ఆయన, కేటీఆర్ పోరాటం మొత్తం తన రాజకీయ భవిష్యత్తు, పదవుల కోసమేనని ఆరోపించారు. నిరుద్యోగ యువత కేటీఆర్ మాటలకు ఆకర్షితులై మోసపోవద్దని సూచించారు.
కేటీఆర్, హరీశ్ రావులపై విమర్శలు చేసిన అద్దంకి దయాకర్, కేటీఆర్‌ను సీరియస్ కాని రాజకీయ నాయకుడిగా అభివర్ణించారు. తనకు అనుకూలంగా సర్వేలు చేయించుకుని ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలపై వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తూ, పార్టీ కోసం దీర్ఘకాలం పనిచేసిన వారికి పదవులు వస్తాయని అన్నారు. కేటీఆర్ ట్రోల్స్, రెచ్చగొట్టే రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!