
గాసిప్స్

మెక్సికో దక్షిణ ప్రాంతంలోని చియాపాస్ తీరంలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. అమెరికా భూగర్భ సర్వే సంస్థ (యూఎస్‌జీఎస్) ప్రకారం, భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదైంది. భూమికి సుమారు 15.2 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రకంపనల ప్రభావంతో మెక్సికోతో పాటు పొరుగు దేశాలైన గ్వాటెమాలా, ఎల్ సాల్వడార్‌లో పలు భవనాలు కంపించాయి.
ప్రస్తుతం ఎలాంటి భారీ నష్టం లేదా ప్రాణనష్టం నమోదుకాలేదని అధికారులు తెలిపారు. అయితే మెక్సికో, గ్వాటెమాలా తీర ప్రాంతాల్లో ప్రమాదకరమైన సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!