
సినిమాలు

ఈ ఏడాది హిందీ చిత్ర పరిశ్రమలో ఊహించని విజయాన్ని అందుకున్న సినిమాల్లో ‘హనుమాన్ అంశ్’ ఒకటి. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం రూ.450 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించినట్లు సమాచారం. నీమ్ కరోలి బాబా జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ మొదటి భాగంలో శోభినవ్ సత్య హీరోగా నటించగా, డాక్టర్ విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించారు.
ఆగస్టు 7న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా దాదాపు రెండు నెలల పాటు విజయవంతంగా ప్రదర్శితమైంది. ఎట్టకేలకు ఇప్పుడు సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లోకి వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న సోనీ లివ్లో నేటి నుంచి హిందీ ఒరిజినల్ వెర్షన్ను వీక్షించవచ్చు. అయితే తెలుగు సహా ఇతర డబ్బింగ్ భాషల్లో చూడాలనుకునే ప్రేక్షకులు మరికొంత కాలం వేచి చూడాల్సి ఉంటుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!