27, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆస్కార్‌ పరిశీలనకు కన్నడ-తెలుగు లఘుచిత్రం ‘పంకజ’..

Writer: Chandrika 04:09 PM, 27 నవంబర్, 2026
ఆస్కార్‌ పరిశీలనకు కన్నడ-తెలుగు లఘుచిత్రం ‘పంకజ’..

ఆస్కార్‌ పురస్కారాల కోసం భారతీయ చిత్రాలు ‘గోంధల్‌’, ‘అంగ్‌’ ఉత్తమ అంతర్జాతీయ చిత్రం విభాగంలో పరిశీలనకు ఎంపికైన విషయం తెలిసిందే. తాజాగా మరో భారతీయ చిత్రం కూడా ఆస్కార్‌ అకాడమీ పరిశీలనకు అర్హత సాధించింది. అదే కన్నడ-తెలుగు లఘుచిత్రం ‘పంకజ’. అనూయ స్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హర్షిణి బోయళ్ల ప్రధాన పాత్రలో నటించారు. విశేషమేమిటంటే.. దర్శకురాలు అనూయ స్వామి, నటి హర్షిణి బోయళ్ల ఇద్దరూ తెలుగువారే. వీరిద్దరూ బెంగళూరులోనే పుట్టి పెరిగారు.

బెంగళూరులోని ఓ మురికివాడలో నివసించే కుటుంబాల నేపథ్యంలో ‘పంకజ’ చిత్రాన్ని తెరకెక్కించారు. పంకజ అనే మహిళ తన కుమార్తెతో కలిసి కనిపించకుండా పోయిన భర్త కోసం వెతికే క్రమంలో ఎదుర్కొన్న పరిస్థితులే ఈ చిత్ర కథాంశం. అధికారం ఉన్న వ్యక్తులు వ్యవస్థలను తమ గుప్పిట్లో పెట్టుకుని సామాన్యులను ఎలా ఇబ్బందులకు గురిచేస్తారనే అంశాన్ని ఇందులో చూపించారు. ప్రతిష్ఠాత్మక సన్‌డ్యాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌ సహా 40కిపైగా అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ఈ లఘుచిత్రం ప్రదర్శితమైంది. రైన్‌డ్యాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో విజేతగా నిలవడంతో ఆస్కార్‌ పరిశీలనకు అర్హత సాధించింది. న్యూయార్క్‌ యూనివర్సిటీలో మీడియా ఆర్ట్స్‌ కోర్సు చదువుతున్న సమయంలో రెండో ఏడాది విద్యార్థి ప్రాజెక్టుగా అనూయ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ లఘుచిత్రానికి మరింత గుర్తింపు తీసుకురావడానికి హాలీవుడ్‌ నటులు స్పైక్‌ లీ, విల్లెం డఫోతో పాటు భారత ఆస్కార్‌ విజేత గునీత్‌ మోంగా ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించేందుకు ముందుకొచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ వివాదం.. దర్శకుడు మార్టిన్ ప్రక్కత్‌పై సైబర్ క్రైమ్ కేసు

‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ వివాదం.. దర్శకుడు మార్టిన్ ప్రక్కత్‌పై సైబర్ క్రైమ్ కేసు

‘రామాయణ’కు సుప్రీంకోర్టులో ఊరట..!

‘రామాయణ’కు సుప్రీంకోర్టులో ఊరట..!

ప్రభాస్ స్పిరిట్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా

ప్రభాస్ స్పిరిట్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా

యూట్యూబ్‌లో సమయ్ రైనా సరికొత్త ప్రపంచ రికార్డు

యూట్యూబ్‌లో సమయ్ రైనా సరికొత్త ప్రపంచ రికార్డు

‘రామాయణ’ చిత్ర బృందానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట

‘రామాయణ’ చిత్ర బృందానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట

హిట్ డైరెక్టర్ల ఆలస్యం..ఎందుకు?

హిట్ డైరెక్టర్ల ఆలస్యం..ఎందుకు?

ట్యాగ్లు
పంకజ లఘుచిత్రంఆస్కార్‌ అవార్డులుకన్నడ తెలుగు సినిమాఅనూయ స్వామిహర్షిణి బోయళ్లసన్‌డ్యాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌రైన్‌డ్యాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌స్పైక్‌ లీవిల్లెం డఫోగునీత్‌ మోంగా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ట్రంప్ అల్లుడిపై అవినీతి ఆరోపణలు చేసిన మాజీ మద్దతుదారు టక్కర్ కార్ల్‌సన్
జనరల్

ట్రంప్ అల్లుడిపై అవినీతి ఆరోపణలు చేసిన మాజీ మద్దతుదారు టక్కర్ కార్ల్‌సన్

కుటుంబం కోసం దేశాన్ని విడిచిపెట్టేందుకూ సిద్ధం: ఆజం ఖాన్
రాజకీయాలు

కుటుంబం కోసం దేశాన్ని విడిచిపెట్టేందుకూ సిద్ధం: ఆజం ఖాన్

చట్టసభల్లో బీసీలకు 27 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి: ఈటల రాజేందర్
జనరల్

చట్టసభల్లో బీసీలకు 27 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి: ఈటల రాజేందర్

యోగి ఆదిత్యనాథ్‌పై సంజయ్ రౌత్ ప్రశంసలు
రాజకీయాలు

యోగి ఆదిత్యనాథ్‌పై సంజయ్ రౌత్ ప్రశంసలు

ఉద్యోగాలు పోతున్నాయని ఏఐని నిందించొద్దు-రామ్‌గోపాల్‌ వర్మ
జనరల్

ఉద్యోగాలు పోతున్నాయని ఏఐని నిందించొద్దు-రామ్‌గోపాల్‌ వర్మ

డప్పు కొడుతూ.. కోలాటం ఆడుతూ.. నషా ముక్త్ భారత్ యాత్రలో కీర్తిరెడ్డి జోష్
జనరల్

డప్పు కొడుతూ.. కోలాటం ఆడుతూ.. నషా ముక్త్ భారత్ యాత్రలో కీర్తిరెడ్డి జోష్

సింగరేణి అండతో విద్యార్థులకు పౌష్టికాహారం.. చదువుకు కొత్త భరోసా!
జనరల్

సింగరేణి అండతో విద్యార్థులకు పౌష్టికాహారం.. చదువుకు కొత్త భరోసా!

భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

మీడియా సందర్శనకు కేజ్రీవాల్ ‘షీష్ మహల్’ను తెరిచిన ఢిల్లీ ప్రభుత్వం
జనరల్

మీడియా సందర్శనకు కేజ్రీవాల్ ‘షీష్ మహల్’ను తెరిచిన ఢిల్లీ ప్రభుత్వం

బుమ్రా బౌలింగ్‌ శైలిలో మార్పు.. ఏదో ప్లాన్‌ ఉండే ఉంటుందన్న ఆకాశ్‌ దీప్‌
క్రీడలు

బుమ్రా బౌలింగ్‌ శైలిలో మార్పు.. ఏదో ప్లాన్‌ ఉండే ఉంటుందన్న ఆకాశ్‌ దీప్‌

ఆస్కార్‌ పరిశీలనకు కన్నడ-తెలుగు లఘుచిత్రం ‘పంకజ’..
సినిమాలు

ఆస్కార్‌ పరిశీలనకు కన్నడ-తెలుగు లఘుచిత్రం ‘పంకజ’..

ఓటీటీలోకి వచ్చిన అజయ్ దేవగన్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చిన అజయ్ దేవగన్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!