

చట్టసభల్లో ఓబీసీ, బీసీలకు రాజ్యాంగబద్ధంగా 27 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆయన, బీసీల చిరకాల డిమాండ్లను సంపూర్ణంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. విద్య, ఉద్యోగ రంగాల్లో రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు కూడా పూర్తిస్థాయిలో అమలుకావడం లేదని పేర్కొన్నారు.
అసెంబ్లీ, శాసనమండలి, పార్లమెంట్ ఉభయ సభల్లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించినప్పుడే బీసీల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని బీసీ సమాజం భావిస్తోందని ఈటల రాజేందర్ తెలిపారు. “ఎవరి వాటా మాకు అక్కర్లేదు.. మా వాటా మాకు కావాలి” అనే నినాదం బీసీల ఆత్మగౌరవం, హక్కుల ఆకాంక్షలను ప్రతిబింబిస్తోందన్నారు. 27 శాతం రాజకీయ రిజర్వేషన్ల డిమాండ్‌ను చట్టసభల్లో ప్రవేశపెట్టి తప్పనిసరిగా అమలు చేయాలని కోరారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!