

శివసేన (UBT) ఎంపీ సంజయ్ రౌత్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై ప్రశంసలు కురిపించారు. యోగి సమర్థుడైన నాయకుడని, హిందుత్వానికి బలమైన ప్రతినిధుల్లో ఒకరని అభివర్ణించారు. ‘యోగి లేకుంటే యూపీ లేదు’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిపై చర్చ జరుగుతున్న వేళ రౌత్ ఈ వ్యాఖ్యలు చేశారు. యోగి తనను తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకోవడం అభినందనీయమని, ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సాధించి, గెలిచిన ఎమ్మెల్యేల మద్దతుతో యోగి మరోసారి ముఖ్యమంత్రి అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు.
మరోవైపు, 2027 ఎన్నికల్లో బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే అంశంపై పార్టీలో చర్చ కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య మాట్లాడుతూ.. ఎన్నికల తర్వాత గెలిచిన ఎమ్మెల్యేల సమావేశంలో ముఖ్యమంత్రిని నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. దీనిపై యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ.. పార్టీ ఎన్నికల్లో కమలం గుర్తుపైనే పోటీ చేస్తుందని, ఎవరు ఏమిటో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు యూపీ రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!