

ప్రతి శుక్రవారం లాగే ఈసారి కూడా ఓటీటీ వేదికలపై కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ల సందడి మొదలైంది. థియేటర్లలో శర్వానంద్ నటించిన ‘భోగి’, విజయ్ ఆంటోనీ ‘నాన్న కుట్టి’ పోటీపడుతుండగా, ఓటీటీలో వెంకటేశ్ నటించిన ‘ఆదర్శకుటుంబం’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతున్న ‘గరివిడి లక్ష్మి’తో పాటు ‘దృశ్యం 3’, ‘హనుమాన్ అంశ్’ వంటి చిత్రాలు కూడా ఈ వారం ఓటీటీ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. వివిధ భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు అందుబాటులోకి వచ్చాయి.
నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్ 27న ‘టైసన్ ఫ్యూరీ’, ‘ది చైల్డ్’, ‘దృశ్యం 3’, ‘ది హంచ్బ్యాక్ సోల్ ఆఫ్ ప్యారిస్’, ‘7 డాగ్స్’ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ‘హనుమాన్ అంశ్’ దక్షిణాది భాషల్లో నవంబర్ 29న విడుదల కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ప్రేమ్ కిటాను’, ‘అమెరికా అమెరికా 2’ అందుబాటులోకి వచ్చాయి. జీ5లో ‘ఆక్టోపస్ సీజన్ 1’, ‘సత్యమేవ సీజన్ 1’, ‘కార్పొరేట్ లవ్ స్టోరీ సీజన్ 1’ విడుదలయ్యాయి. సోనీలివ్‌లో ‘హనుమాన్ అంశ్’, జియోహాట్‌స్టార్‌లో ‘దాయి చాల్’, ఆహాలో ‘రాతిరి’, సన్ నెక్ట్స్‌లో ‘ఎనిమీ ఆఫ్ ది స్మగ్లర్’ స్ట్రీమింగ్ అవుతున్నాయి. లయన్స్‌గేట్ ప్లేలో ‘ఏప్రిల్ ఎక్స్’, ‘జీవన్ యా బీమా కాన్?’, ‘ది స్ట్రేంజర్స్ చాప్టర్ 1’ అందుబాటులోకి వచ్చాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!