

తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అయిన బోల్డ్ వెబ్ సిరీస్ ‘3 రోజెస్’ యువతలో మంచి ఆదరణ పొందింది. డైరెక్టర్ మారుతి టీమ్ నుంచి వచ్చిన ఈ సిరీస్‌కు మంచి క్రేజ్ వచ్చింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వచ్చిన ‘3 రోజెస్ సీజన్ 2’ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్‌లో ఈషా రెబ్బా, రాశి సింగ్, కుషిత కల్లపు ప్రధాన పాత్రల్లో నటించారు.
ఇప్పుడీ వెబ్ సిరీస్‌ను మూవీ రూపంలో ప్రేమికుల రోజు సందర్భంగా ఈ నెల (ఫిబ్రవరి) 14 న ఆహాలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సిరీస్‌ను చూడని వారు మూవీగా చూసి ఆస్వాదిస్తారని వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. బోల్డ్ రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను వినోదపరుస్తుందని యూనిట్ తెలిపింది.
హర్ష చెముడు, సత్య, సుదర్శన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని కిరణ్ కె కరవల్ల దర్శకత్వం వహించగా, ఎస్కెఎన్ నిర్మించారు. వెబ్ సిరీస్‌గా మంచి పేరు తెచ్చుకున్న ఈ కథ, మూవీగా ఎలాంటి స్పందన పొందుతుందో చూడాలి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!