
క్రీడలు

హైదరాబాద్ నగరంలోని రాయదుర్గంలో యువ యూట్యూబర్ కోమలి ఆత్మహత్య చేసుకుంది. మణికొండ చిత్రపూరి కాలనీలో తన మామ ఇంట్లో ఉంటున్న ఆమె, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది.
కోమలి మూడేళ్లుగా మరో యూట్యూబర్ అఖిల్ రెడ్డితో ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో ఏడాది క్రితం విడిపోయినట్లు సమాచారం. కొన్ని నెలల క్రితం కూడా ఆమె ఆత్మహత్యాయత్నం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
మల్లారెడ్డి యూనివర్సిటీలో బీఎస్సీ చదువుతున్న కోమలి, చదువుతో పాటు యూట్యూబ్ వీడియోలు రూపొందించేది. అఖిల్ రెడ్డి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ యూట్యూబర్‌గా కొనసాగుతున్నాడు. ప్రేమలో వచ్చిన సమస్యలే ఈ దుర్ఘటనకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!