

ఫేక్ వార్ వీడియోలు, పిక్స్‌ను అడ్డుకునేందుకు ఎక్స్ ఓ కొత్త నిర్ణయం తీసుకున్నది. యుద్ధంపై ఏఐ జనరేట్ ఫూటేజ్ పోస్టు చేస్తున్న వారికి ఎక్స్ సంస్థ వార్నింగ్ ఇచ్చింది. ఆ ప్లాట్‌ఫామ్‌కు చెందిన రెవన్యూ షేరింగ్ నుంచి ఆ క్రియేటర్‌ను తొలగించనున్నట్లు బెయర్ చెప్పారు. ఎక్స్‌లో వీడియోలు పోస్టు చేసే క్రియేటర్లకు ఆ సంస్థ రెవన్యూ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ రెవన్యూపై ఆంక్షలు పెట్టేందుకు ఎక్స్ చర్యలు తీసుకున్నది. ఒకవేళ ఏఐ పాలసీని ఓవరైనా క్రియేటర్ రెండో సారి ఉల్లంఘిస్తే అప్పుడు ఆ వ్యక్తి రెవన్యూ అకౌంట్‌ను పర్మనెంట్‌గా సస్పెండ్ చేయనున్నట్లు బెయర్ తెలిపారు.
కమ్యూనిటీ నోట్స్ ద్వారా ఏఐ కాంటెంట్‌ను ఎక్స్ గుర్తిస్తుంది. ఏఐకి చెందిన తప్పుడు కాంటెంట్‌ను పసికట్టే ఫీచర్‌ను ఎక్స్‌లో పొందుపరిచారు. అయితే పోస్టు చేసిన వీడియోలో ఏవైనా ఇతర సిగ్నల్స్ ఉన్నాయో లేదో అని కూడా గమనించనున్నారు. ఏఐ టెక్నాలజీ అభివృద్ధి చెందిన నేపథ్యంలో ఎక్స్ యూజర్లు విస్తృత స్థాయిలో ఏఐ జనరేటెడ్ వీడియోలు, ఫోటోలను పోస్టు చేస్తున్నారు. ఇక ఇరాన్ వార్ వల్ల కూడా ఫేక్ కాంటెంట్ విపరీతంగా పెరిగిపోయింది. టెల్ అవివ్‌పై క్షిపణులు దాడి చేసినట్లు ఇటీవల ఓ ఫేక్ ఏఐ వీడియో రిలీజైంది. ఆ వీడియోను విస్తృత స్థాయిలో షేర్ చేశారు. మిలియన్ల సంఖ్యలో ఆ వీడియోకు లైక్స్ వచ్చాయి. ఇక అమెరికా దాడిలో ఓ స్కూల్లో సుమారు 150 మంది చిన్నారులు మృతిచెందినట్లు ఉన్న ఫేక్ ఫోటోను కూడా ఏఐ ద్వారా క్రియేట్ చేసి ఎక్స్‌లో షేర్ చేశారు. చాలా మంది ఉన్నతాధికారులు కూడా ఫోటోను షేర్ చేశారు. అయితే అది ఫేక్ పిక్ అని, ఏఐ జనరేటెడ్ కాంటెంట్ అని ఎక్స్ తేల్చింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!