

వాషింగ్టన్: మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కట్టడి పేరుతో వెనెజువెలాపై తీవ్ర దాడులతో అగ్రరాజ్యం అమెరికా విరుచుకుపడుతోంది. ఈ దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. దాడుల్లో వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను నిర్బంధించినట్టు ప్రకటించారు. వెనెజువెలా నుంచి వేరే ప్రాంతానికి వారిని తరలిస్తున్నట్టు తెలుస్తోంది.
వెనెజువెలా రాజధాని కరాకస్‌లో శనివారం తెల్లవారుజామున ఏడు చోట్ల బాంబు పేలుళ్లు సంభవించాయి. ట్రంప్ ఆదేశాలతోనే ఈ దాడులు జరుగుతున్నట్టు కథనాలు వెలువడ్డాయి. వెనెజువెలా ముఠాల నుంచి మాదక ద్రవ్యాలు అమెరికాను ముంచెత్తుతున్నాయని, అధ్యక్షుడు మదురోకు కూడా ఈ ముఠాలతో సంబంధం ఉందని ఆమెరికా ఆరోపిస్తోంది.
కాగా, రాజధాని కారాకస్‌తో పాటు మిరాండా, అరగువా, లాగైరా రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా మిలటరీ దాడులు జరిపినట్టు వెనెజువెలా ప్రభుత్వాధికారులు తెలిపారు. దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రభుత్వం ప్రకటించారు. విదేశీ మిలటరీ జోక్యాన్ని వెనెజువెలా రక్షణ మంత్రి వ్లాడిమిర్ పిడ్నినో ఖండించారు. పౌరులు, సైనిక స్థావరాలు లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని, ఈ చర్య చట్టవిరుద్ధమైన దురాక్రమణగా ఆయన పేర్కొన్నారు.









.png&w=3840&q=75)








.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!