
గాసిప్స్

రేపటి నుంచి స్కూల్, కాలేజీలు ప్రారంభం కావడంతో పల్లెల నుంచి పట్టణాల వైపు ప్రజలు భారీగా తరలివచ్చారు. దీంతో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. ప్రయాణికుల రాకపోకలు పెరగడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది.
ప్రత్యేకంగా చిట్యాల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు చిట్యాల నుంచి భువనగిరి మీదుగా వాహనాలను మళ్లించారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పోలీసులు అప్రమత్తంగా చర్యలు చేపట్టారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!