
గాసిప్స్

ఏలూరు జిల్లాలో అక్రమంగా జంతుకొవ్వు నూనె తయారీ జరుగుతోందన్న సమాచారంతో విజిలెన్స్ అధికారులు నిఘా పెంచారు. ఈ క్రమంలో నిన్న ఏలూరులోని రెండు కేంద్రాలపై విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 330 లీటర్ల యానిమల్ ఫ్యాట్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఈ నూనె తయారీ జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు.
విజిలెన్స్ దాడుల నేపథ్యంలో జిల్లాలోని అనధికార కబేళాలు మూతపడుతున్నాయి. దాడుల భయంతో పలుచోట్ల అక్రమ కార్యకలాపాలను నిలిపివేసినట్లు సమాచారం. ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతున్న ఇలాంటి కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. అక్రమంగా జంతుకొవ్వు నూనె తయారీ, నిల్వ, సరఫరా చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని విజిలెన్స్ స్పష్టం చేసింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!