
న్యూస్

నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం తిమ్మన్నపల్లి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కర్ణాటక నుంచి శ్రీశైలం వెళ్తున్న ఓ వ్యాన్ అదుపు తప్పి కల్వర్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉండగా, వారు కర్ణాటకకు చెందిన వారిగా గుర్తించారు.
ప్రమాద సమయంలో వ్యాన్లో మొత్తం 10 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టడంతో పాటు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!