
న్యూస్

చంద్రగ్రహణం కారణంగా శాస్త్రోక్తంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ తలుపులను మూసివేశారు. ఆలయం రాత్రి 7:30 గంటల వరకు మూసివేయబడుతుందని దేవస్థానం అధికారులు తెలిపారు. గ్రహణం మధ్యాహ్నం 3:20 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:47 గంటలకు ముగియనున్న నేపథ్యంలో సంప్రదాయం ప్రకారం ముందుగానే ఆలయాన్ని మూసివేశారు.
రాత్రి 7:30 గంటలకు ఆలయ తలుపులు తిరిగి తెరిచి శుద్ధి కార్యక్రమాలు, పుణ్యాహవచనం నిర్వహించనున్నారు. అనంతరం రాత్రి 8:30 గంటల తరువాత భక్తులకు తిరుమలలో సర్వదర్శనాలు పునఃప్రారంభం అవుతాయి. భక్తులు ఈ మార్పులను గమనించి తమ దర్శనాన్ని అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!