

జగదేవ్పూర్ మండలం దౌలాపూర్ అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చిన పెద్దపులి వరుస గ్రామాల్లో సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం బసంతపూర్ సమీపంలో ఓ లేగదూడపై దాడి చేసి చంపినట్లు అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. పులి కదలికలతో సరిహద్దు గ్రామాల ప్రజలు రాత్రింబవళ్లు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
అటవీ శాఖ అధికారులు పులి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పాదముద్రల ఆధారంగా పులి తాజాగా జనగామ జిల్లా ఆలేరు మండలం శ్రీనివాసపురం గ్రామ పరిసరాల వైపు వెళ్లినట్లు గుర్తించారు. ఘటనాస్థలాల్లో అటవీ శాఖ బృందాలు విస్తృత తనిఖీలు చేపట్టి, పులి సంచరించే మార్గాల్లో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రజలు ఒంటరిగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పులి కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని అధికారులు హెచ్చరించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!