

ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఎక్స్ప్రెస్వే సొరంగాన్ని చైనా శుక్రవారం అధికారికంగా ప్రారంభించింది. ఈ సొరంగానికి ‘తియాన్షన్ షెంగ్లీ సొరంగం’ అని నామకరణం చేశారు. దీని మొత్తం పొడవు 22.13 కిలోమీటర్లు, ఇది ఇంతవరకు ఉన్న అన్ని ఎక్స్ప్రెస్వే సొరంగాల కంటే ఎక్కువగా ఉండడం విశేషం.
ఈ సొరంగం వాయవ్య చైనాలోని షింజియాంగ్ యూగర్ అటానమస్ రీజియన్ లో, సెంట్రల్ తియాన్షన్ పర్వత శ్రేణుల గుండా నిర్మించబడింది. గతంలో ఈ పర్వత ప్రాంతంలో ప్రయాణానికి గంటల సమయం పట్టేది. ఇప్పుడు ఈ సొరంగం ప్రారంభంతో ఆ ప్రయాణ కాలం కేవలం 20 నిమిషాలకు తగ్గింది.
‘తియాన్షన్ షెంగ్లీ’ సొరంగం 324.7 కిలోమీటర్ల పొడవైన G0711 ఉరుమ్కీ–యులి ఎక్స్ప్రెస్వే లో కీలక భాగంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రాంతీయ రవాణా మరింత వేగవంతమవడంతో పాటు, ఆర్థిక అభివృద్ధికి కూడా ఊతం లభిస్తుందని చైనా అధికారులు భావిస్తున్నారు.
.png&w=3840&q=75)



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!