

ప్రయాణికుల సౌకర్యం కోసం TGSRTC ‘మీ సేవ – మీ టికెట్’ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, స్పెషల్ సెక్రటరీ వికాస్ రాజ్, ఆర్టీసీ వీసీ & ఎండీ వై.నాగిరెడ్డి, మీ సేవ కమిషనర్ రవికిరణ్ కలిసి యాప్‌ను ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా OPRS సేవలు అనుసంధానమై, సుదూర మరియు ఇంటర్సిటీ బస్ టికెట్లను డిజిటల్‌గా బుక్ చేసుకునే అవకాశం లభిస్తోంది. మొత్తం 1,710 OPRS సేవలు అందుబాటులో ఉండగా, అందులో 450 A/C, 1,260 నాన్-A/C సేవలు ఉన్నాయి. రోజుకు సుమారు 13,000 సీట్ల బుకింగ్ జరుగుతోంది. బెంగుళూరు, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, మంచిర్యాల, ఖమ్మం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, వరంగల్ వంటి ప్రధాన గమ్యస్థానాలకు టికెట్లు పొందవచ్చు.
గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో ఐదు రకాల సిటీ బస్ పాస్‌లు కూడా యాప్ ద్వారా డిజిటల్‌గా లభిస్తున్నాయి. ప్రయాణికులు నెలవారీ పాస్‌లను తీసుకోవడం, పునరుద్ధరించడం సులభమైంది. అందుబాటులో ఉన్న పాస్‌లు: సిటీ ఆర్డినరీ (₹1,400), మెట్రో ఎక్స్‌ప్రెస్ (₹1,600), మెట్రో డీలక్స్ (₹1,800), గ్రీన్ మెట్రో లగ్జరీ A/C (₹2,200), పుష్పక్ A/C (₹5,000).
అదనంగా, T24 టికెట్‌ను కూడా యాప్‌లో విలీనం చేశారు. ఇది 24 గంటల డిజిటల్ ట్రావెల్ పాస్. యాక్టివేషన్ తర్వాత సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్ బస్సుల్లో అపరిమిత ప్రయాణం చేయవచ్చు. రోజుకు సగటున 16,830 T24 టికెట్లు అమ్ముడవుతున్నాయి. ఛార్జీలు: పెద్దలు ₹130, పిల్లలు ₹90, మహిళలు (ఇతర రాష్ట్రాలు) / సీనియర్ సిటిజన్ ₹110. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ఈ యాప్ ద్వారా అన్ని రకాల RTC బస్సుల్లో టికెట్లు, పాస్‌లు, T24 టికెట్లు సులభంగా పొందవచ్చని తెలిపారు. RTC ఎండీ నాగిరెడ్డి, స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ ప్రజలు ఈ డిజిటల్ సేవలను వినియోగించుకోవాలని కోరారు.









.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!