

తెలంగాణ గద్దర్ అవార్డులు రెండువేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన విజేతలను ప్రకటించారు. ఉత్తమ చిత్రంగా రాజు వెడ్స్ రాంబాయి మొదటి బహుమతిని సాధించగా, రెండవ స్థానంలో దండోరా నిలిచింది. మూడవ ఉత్తమ చిత్రంగా ది ప్రీ వెడ్డింగ్ షో ఎంపికైంది. తండేల్ చిత్రానికి కథానాయకుడిగా నటించిన నాగచైతన్య ఉత్తమ నటుడిగా ఎంపిక కాగా, ది గర్ల్ ఫ్రెండ్ చిత్రానికి రష్మిక మందన్న ఉత్తమ నటిగా ఎంపికయ్యారు.
ఇక ప్రత్యేక పురస్కారాల కింద ఎన్టీఆర్ అవార్డును చిరంజీవికి, ఏఎన్ఆర్ అవార్డును జయసుధకు ప్రదానం చేశారు. కాంతారావు అవార్డును ఆర్ నారాయణమూర్తికి, బి ఎన్ రెడ్డి అవార్డును సింగీతం శ్రీనివాసరావుకు అందజేశారు. పైడి జయరాజ్ అవార్డును కమల్ హాసన్‌కు ప్రకటించారు. రాజు వెడ్స్ రాంబాయి చిత్రానికి సాయిలు ఉత్తమ దర్శకుడిగా ఎంపిక కాగా, దండోరా చిత్రానికి శివాజీ ఉత్తమ సహాయ నటుడిగా ఎంపికయ్యారు. అలాగే పలు విభాగాల్లో మరికొంత మంది కళాకారులు పురస్కారాలు అందుకున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!