
గాసిప్స్
.jpg&w=3840&q=75)
భారత సుప్రీంకోర్టు దేవస్థానాల ఆస్తుల విషయంలో కీలక తీర్పు ఇచ్చింది. దేవస్థానాలకు చేరే నిధులు భక్తుల సమర్పణగా, దేవుని ఆస్తిగా పరిగణించాలనే అంశాన్ని స్పష్టం చేసింది. ఈ నిధులను ఇతర వ్యవస్థల ప్రయోజనాలకు, ముఖ్యంగా సహకార బ్యాంకులు నిలదొక్కుకునే ప్రయత్నాలకు ఉపయోగించేందుకు వీలు లేదని స్పష్టంగా పేర్కొంది.
కేరళ హైకోర్టు దేవస్థానం డిపాజిట్ చేసిన మొత్తం తిరిగి ఇవ్వాలని సూచించిన తీర్పును సహకార బ్యాంకులు సుప్రీంకోర్టులో సవాలు చేశాయి. అయితే, సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఆ కేసును పరిశీలించిన అనంతరం, హైకోర్టు తీర్పు సరైనదేనని తేల్చింది. దేవస్థానాల నిధులు కేవలం ఆ దేవాలయ అవసరాల కోసమే వినియోగించాల్సిందేనని, వాటిని బ్యాంకుల ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి వాడటం చట్టబద్ధం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!