

విమాన ప్రయాణాల్లో భద్రతను మరింత పటిష్టం చేసే దిశగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పవర్ బ్యాంకులు, లిథియం బ్యాటరీతో పనిచేసే పరికరాలను విమానంలో ఛార్జ్ చేయడం లేదా ఇన్-సీట్ పవర్ సిస్టమ్‌లతో వినియోగించడం పూర్తిగా నిషేధం. ఇవి చెక్-ఇన్ లగేజీలో కాకుండా, ప్రయాణికులు తమ చేతిలో క్యారీ చేయాల్సి ఉంటుందని డీజీసీఏ స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా లిథియం బ్యాటరీలు వేడెక్కి పేలిపోతున్న ఘటనలు పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
కొత్త నిబంధనల ప్రకారం, లిథియం బ్యాటరీ పరికరాలు తీసుకెళ్లే ప్రయాణికులు వాటి వివరాలను ఎయిర్‌లైన్స్‌కు తెలియజేయాలి. పరికరాల్లో వేడి, పొగ, లేదా అసాధారణ వాసన కనిపిస్తే వెంటనే క్యాబిన్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించింది. ఈ నియమాలపై ప్రయాణికుల్లో అవగాహన పెంచేందుకు ఎయిర్‌లైన్స్ నిరంతరం ప్రకటనలు చేయాలని ఆదేశించింది. గతేడాది అక్టోబర్‌లో ఢిల్లీ విమానాశ్రయంలో డియాపూర్ వెళ్తున్న ఇండిగో విమానంలో పవర్ బ్యాంక్ పేలిన ఘటన నేపథ్యంలో, ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఈ చర్యలు తీసుకున్నట్టు డీజీసీఏ వెల్లడించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!