
గాసిప్స్

తమిళనాడులో నటుడు-నేత విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) మొత్తం 108 సీట్లు గెలిచి సంచలనం సృష్టించినప్పటికీ, 7 జిల్లాల్లో మాత్రం ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. కన్యాకుమారి, మైలాడుదురై, తిరువారూర్, నాగపట్నం, నీలగిరి, తెన్కాశి, అరియలూర్ జిల్లాల్లో పార్టీ ఖాతా తెరవలేకపోయింది.
మత్స్యకారులు అధికంగా ఉన్న నాగపట్నం, మైలాడుదురై జిల్లాల్లో ముందుగా కనిపించిన మద్దతు ఓట్లుగా మారలేదు. అదే సమయంలో ప్రధాన పార్టీలు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) 7 జిల్లాల్లో, ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) 9 జిల్లాల్లో సీట్లు గెలవలేకపోయాయి.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!