
న్యూస్

తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) శ్రీవాణి ఆన్లైన్ ప్రస్తుత బుకింగ్ వ్యవస్థలో కీలక మార్పులు చేసింది. గతంలో భక్తులు ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించేందుకు ఈ కొత్త విధానం అమలులోకి వచ్చింది. ఇకపై భక్తులు ఒకే చెల్లింపుగా ₹10,500 చెల్లించవచ్చు. ఇందులో ₹10,000 శ్రీవాణి ట్రస్ట్ విరాళం, ₹500 విఐపీ బ్రేక్ దర్శనం టికెట్ ఫీజు కలిపి ఉంటాయి.
నిన్న (శుక్రవారం) నుంచి అమలులోకి వచ్చిన ఈ కొత్త విధానం వల్ల బుకింగ్ సమయంలో గందరగోళం తగ్గి వేగవంతమైన సేవలు అందుతాయని టీటీడీ అధికారులు తెలిపారు. శ్రీవాణి పథకం కింద దర్శనం పొందే భక్తులకు మరింత పారదర్శకత మరియు సౌకర్యం కల్పించడమే ఈ మార్పుల లక్ష్యమని పేర్కొన్నారు. డిజిటల్ సేవలను మెరుగుపరచడంలో టీటీడీ తీసుకుంటున్న చర్యల్లో ఇది మరో ముఖ్యమైన ముందడుగు.
.png&w=3840&q=75)






.webp&w=3840&q=75)














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!