

హైదరాబాద్ భక్తులను పరవశింపజేసేందుకు శ్రీవారి కళ్యాణం సిద్ధమవుతోంది. భక్తకోటి కనుల పండుగగా టీటీడీ ఆధ్వర్యంలో, మహాగ్రూప్స్ అధినేత మారెళ్ల వంశీకృష్ణ సంకల్పంతో గచ్చిబౌలి స్టేడియంలో నవంబర్ 26 వ తేదీన సాయంత్రం 5 గంటలకు శ్రీనివాస కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. త్రైలోక సుందరుడైన శ్రీవారికి జరగబోయే ఈ దివ్య కళ్యాణానికి సంబంధించిన పవిత్ర పోస్టర్ను వంశీరామ్స్ బిల్డర్స్ అధినేత సుబ్బారెడ్డి, అపర్ణ గ్రూప్ చైర్మన్ సీవీ రెడ్డి, సుచిర్ ఇండియా అధినేత కిరణ్, స్వగృహ చైర్మన్ బీపీ నాయుడు, టీమ్ 4 అధినేత యార్లగడ్డ మురళి, మహాగ్రూప్ సీఎండీ మారెళ్ల వంశీకృష్ణ సహా పలువురు ఇటీవల ఆవిష్కరించారు.
పతిత పావనుడి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఈ సందర్భంగా మహాన్యూస్ సిఎండీ మారెళ్ల వంశీకృష్ణ మాట్లడుతూ... తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియం నందు నవంబర్ 26 వ తేదీన సాయంత్రం 5 గంటల నుండి నిర్వహించడం జరుగుతుంది. ఈ వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి ప్రతి ఒక్కరూ వచ్చి స్వామి వారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము అన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!