

మునివాహన ఉత్సవ పరంపర పునరుద్ధరణకు, రాజ్యాంగ రామరాజ్య స్థాపనకు చేసిన కృషికి గాను చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ చిల్కూరు రంగరాజన్‌కు ప్రతిష్ఠాత్మక ‘వివేకానంద పురస్కారం’ లభించింది. గీతా జయంతి సందర్భంగా వేదశ్రీ తపోవన్ నిర్వహించిన కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ డా. ఆచార్య దేవవ్రత్ ఈ అవార్డును అందజేశారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోశాధికారి పూజ్యశ్రీ గోవిందదేవ్ గిరి స్వామీజీ అధ్యక్షత వహించారు.
సమానత్వం, భక్తి, సామాజిక అడ్డంకులను తొలగించే తిరుప్పాన్ ఆళ్వార్ సందేశాన్ని నేటి సమాజానికి చేర్చిన మునివాహన ఉత్సవ పునరుజ్జీవనం, ధర్మ-న్యాయ-దయాధారిత రామరాజ్యాన్ని రాజ్యాంగ విలువలతో సమన్వయం చేస్తూ పునఃస్థాపించాలనే రంగరాజన్ గారి నిరంతర కృషిని ఈ పురస్కారం ప్రత్యేకంగా గుర్తించింది. ఆధ్యాత్మిక సంప్రదాయాలు-రాజ్యాంగ ఆదర్శాల మధ్య సేతువుగా నిలిచిన ఆయన సేవలు దేశానికి మార్గదర్శకమని నాయకులు కొనియాడారు. ఇలాంటి మహానుభావుడిని సత్కరించడం తమకు గర్వకారణమని వేదశ్రీ తపోవన్ తెలిపారు.


.webp&w=3840&q=75)

















కామెంట్స్ (2)
ఇలాంటి మహనీయుల కృషి దేశానికి ప్రేరణ.
A well-deserved honor for his spiritual service.