
న్యూస్

ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి సువర్ణలత (86) ఈరోజు ఉదయం స్వగృహంలో కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె చివరకు తుదిశ్వాస విడిచారు. ఈరోజు సాయంత్రం బెంగళూరులో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
సువర్ణలత మృతిపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ‘‘శ్రీమతి సువర్ణలత గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ప్రకాశ్ రాజ్, ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!