
ఆరోగ్యం

దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పీరాగఢి ఫ్లైఓవర్ వద్ద పార్క్ చేసి ఉన్న ఒక కారులో మూడు మృతదేహాలు లభించాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
పోలీసులు మృతుల వివరాలు గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. కారులో మృతదేహాలు ఎలా వచ్చాయి అనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఇది హత్యా? లేక ప్రమాదమా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!