

హెచ్డీ సినిమా పైరసీ వ్యవహారం పై ఐ బొమ్మ రవి తాజాగా సంచలన విషయాలను వెల్లడించాడు. సినిమాలను అక్రమంగా రికార్డ్ చేసి, వాటిని టెలిగ్రామ్ ఛానళ్ల ద్వారా విక్రయించిన విధానం పై అతడు వివరాలు వెల్లడించినట్లు సమాచారం. రవి తెలిపిన వివరాల ప్రకారం, శాటిలైట్ లింక్‌ను హ్యాక్ చేసి సినిమాలను HD ఫార్మాట్లో రికార్డ్ చేశారని, ఆ కంటెంట్‌ను టెలిగ్రామ్‌లో ప్రత్యేక ఛానళ్ల ద్వారా పంపిణీ చేశారని తెలుస్తోంది. ఈ పైరసీ కార్యకలాపాలకు “HD హబ్” అనే పేరుతో టెలిగ్రామ్ ఛానల్‌ను ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు.
సినిమా పైరసీ లింక్‌లను అప్లోడ్ చేసి, ఒక్కో సినిమా కోసం 100 నుంచి 300 డాలర్ల వరకు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ మార్గంలో పలు తాజా సినిమాలను అక్రమంగా లీక్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ప్రత్యేకంగా హిట్, థండేల్, కిష్కింధకాండ వంటి చిత్రాలను శాటిలైట్ లింక్‌ల ద్వారా రికార్డ్ చేసి, వాటిని టెలిగ్రామ్ ద్వారా పంపిణీ చేసినట్టు అధికారులు నిర్ధారించారు. ఈ ఘటన సినిమా పరిశ్రమలో తీవ్ర ఆందోళనకు దారి తీసింది.
సినిమా పైరసీ వల్ల నిర్మాతలకు భారీ నష్టాలు వాటిల్లుతున్న నేపథ్యంలో, ఈ తరహా అక్రమ కార్యకలాపాల పై కఠిన చర్యలు తీసుకోవాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!